ప్రసిద్ధ కవి, ఉపాధ్యాయుడు కరీముల్లాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండకు చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రభుత్వం అందజేసింది. సెప్టెంబర్ 5 న నర్సరావుపేటలో భువన చంద్ర టౌన్ హాల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు డియివో యల్.చంద్రకళ, జిల్లా పరిషత్ ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా, యంపి లావు కృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. కరీముల్లా ప్రస్తుతం వినుకొండ మండలంలోని నాగులవరం ఆదర్శ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. విద్యార్థులు, ప్రజల దృష్టిలో ఆదర్శ ఉపాధ్యాయునిగా నిలిచారు. (Story:ప్రసిద్ధ కవి, ఉపాధ్యాయుడు కరీముల్లాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు)
