Home వార్తలు తెలంగాణ  బోరు బావుల విద్యుత్ కనెక్షన్ కు రైతు డి.డి మాత్రమే కట్టాలి

 బోరు బావుల విద్యుత్ కనెక్షన్ కు రైతు డి.డి మాత్రమే కట్టాలి

0

 బోరు బావుల విద్యుత్ కనెక్షన్ కు రైతు డి.డి మాత్రమే కట్టాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : రైతులు తమ బోరు బావులకు విద్యుత్ కనెక్షన్ తీసుకోడానికి విద్యుత్ శాఖకు నిబంధనల ప్రకారం డి.డి కట్టి దరఖాస్తు చేసుకుంటే చాలని, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం మంత్రి వనపర్తి జిల్లా పానగల్ మండలం, చిన్నంబావి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. పానగల్ మండలం దావాజిపల్లి గ్రామంలో రూ. 196.83 లక్షల వ్యయంతో నిర్మించనున్న 33/11 కే.వి విద్యుత్ సబ్ స్టేషన్ కు శంఖుస్థాపన చేశారు. అదే గ్రామంలో బుచ్చమ్మ అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఇంటికి భూమి పూజ చేశారు. చిన్నంబావి మండలములో అయ్యవారి పల్లి గ్రామ పరిధిలో ఒక 33/11 కెవి సబ్ స్టేషన్ ను శంఖుస్థాపన చేశారు. చిన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామంలో శ్రీ తిరుమల నాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో రూ. ఒక కోటి వ్యయంతో దేవాలయ నిర్మాణం, పర్యాటక శాఖ నిధులు రూ. 3.00 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీలెవల్ కల్చరల్ ఆడిటోరియం పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ సైతం చేశారు. అయ్యవారి పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రానికి భూమి పూజ చేశారు. అనంతరం చిన్నంబావి మండల కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 23 మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు సి.యం. రిలీఫ్ ఫండ్ చెక్కులను సైతం అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ బోరు బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి విద్యుత్ శాఖ ద్వారా ట్రాన్స్ఫార్మర్, సరిపడ విద్యుత్ స్తంభాలు, కాసారాలు, ఇతర సామాగ్రిని కార్వాక్టర్లకు ఇచ్చి పని చేసినందుకు డబ్బులు కూడా మంజూరు చేయడం జరుగుతుందని కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే రైతు స్తంభాలు, వైర్లు, ఇతర పనిముట్లు కొని స్తంబాలు సైతం మోస్తున్నాడని దిగ్బ్రతి వ్యక్తం చేశారు. విద్యుత్ కాంట్రాక్టర్లకు పని తక్కువ లాభం ఎక్కువ ఆర్జిస్తున్నారని అందుకే కాంట్రాక్టు కొరకు పోటీ పెరిగిపోతున్నారు. ఇక నుండి ఇలా జరగడానికి వీలు లేదని, రైతు డి.డి కట్టి దరఖాస్తు చేసుకుంటే నిర్ణిత గడువు 60 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ బిగించి కనెక్షన్ ఇచ్చే బాధ్యత విద్యుత్ శాఖదే అని కరాఖండిగా తేల్చిచెప్పారు. డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, విద్యుత్ శాఖ ఎస్. ఈ. రాజశేఖరం, డి. ఈ శ్రీనివాసులు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అఫ్జల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, తహసిల్దార్ లు సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ గోవింద రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story: బోరు బావుల విద్యుత్ కనెక్షన్ కు రైతు డి.డి మాత్రమే కట్టాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version