కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, CMRF చెక్కులను పంపిణీ
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి శుక్రవారం వనపర్తి పట్టణం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వనపర్తి పట్టణం మరియు వనపర్తి మండలంకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది . కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మీరు గెలిపించిన మీ పెద్ద కొడుకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల క్షేమం కొరకు సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అదే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల కన్నా ముందు చెప్పిన మాట ప్రకారం సంక్షేమ ఫలాలు అమలు చేయడం జరిగింది 10 లక్షలకు ఆరోగ్య భీమా,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 కే గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,పేద కుటుంబాలకు 6 కిలోలు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, నియోజకవర్గంలోని సీసీ రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు పెన్షన్లు వనపర్తి నియోజకవర్గంలోని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు తన సొంత డబ్బులతో అభయ హస్తం పేరిట 5వేల రూపాయలు వనపర్తి ప్రజలకు అందించడం జరుగుతుంది హామీలు ఇచ్చిన ప్రతి పథకం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లడం జరుగుతుంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో డిసిసిబి జిల్లా అధ్యక్షులు మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని రెడ్డి వనపర్తి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ పెద్దల తో పాటు , వైస్ చైర్మన్ లు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ పట్టణ కౌన్సిలర్లు, ఆయా మండలాల SC,ST, BC, మైనార్టీ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మహిళా సోషల్ మీడియా అధ్యక్షురాలు, మహిళా సంఘం సభ్యురాలు, NSUI సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story:కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, CMRF చెక్కులను పంపిణీ )
