Homeవార్తలువిజయ్ మిల్టన్   టైటిల్ లాంచ్

విజయ్ మిల్టన్   టైటిల్ లాంచ్

విజయ్ మిల్టన్   టైటిల్ లాంచ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా :రాజ్ తరుణ్ – విజయ్ మిల్టన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ రేపు విడుదల కానుంది . తమిళ సినీ తారలు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, ఆర్యతో పాటు తెలుగు యంగ్ హీరో మాస్ క దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ చిత్రం టైటిల్ విడుదల కానుంది. ఈ టైటిల్ లాంచ్ వినాయక చవితి సందర్భంగా రేపు ఉదయం 11:11 గంటలకు జరగనుంది.

విజయ్ మిల్టన్ దర్శకత్వంలో, రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ప్రొడక్షన్ నెం. 5గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.

ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టైటిల్ అనౌన్స్‌మెంట్‌పై కూడా ప్రేక్షకులు, సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. (Story:విజయ్ మిల్టన్   టైటిల్ లాంచ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments