ఎరువుల షాపులను తనిఖీలు చేసిన అధికారులు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ టౌన్ పరిధిలోని ఎరువుల షాపులను తాసిల్దార్ సురేష్ నాయక్, మండల వ్యవసాయ అధికారి జీ. వరలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈపాస్ నిల్వలు, గోడౌన్ లో నిల్వలు, స్టాక్ రిజిస్టర్ నిల్వలతో పోల్చి చూచి, ఫారం పోర్ లు ఉన్నాయో లేదో పరిశీలించి, స్టాక్ బోర్డు నిర్వహణ పరిశీలించారు. రైతులకు గరిష్టదర కు మించి ఎరువులు విక్రయించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(Story:ఎరువుల షాపులను తనిఖీలు చేసిన అధికారులు)

