Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి సోపానం

పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి సోపానం

0

పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి సోపానం

న్యూస్ తెలుగు/ చింతూరు : పరిసరాల పరిశుభ్రత మనిషి ఆరోగ్యానికి సోపానం అని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ టిడిపి మండల అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రభుత్వ అధికారులు ఎస్టీ కాలనీ లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడి కేంద్రం వద్ద దోమ లార్వాలను పిచికారి కార్యక్రమం నిర్వహించి అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సుండం శ్రీనివాస్ దొర, జమాల్ ఖాన్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని అప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. వీధుల్లో మురికి నీరు త్రాగునీరు కలుషితం లేకుండా చూడాలని త్రాగునీరు వర్షాకాలంలో అధిక మొత్తంలో కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున వేడి చేసి చల్లార్చి వడపోసి త్రాగటం వలన చాలావరకు ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అన్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం ఏ జి హెచ్ ఎస్. ఎస్ఎంఎస్ హాస్టల్ వద్ద మురికినీరు కాలువల్లో ఆయిల్ బాల్స్ లను వేయడం జరిగింది దీనివలన దోమల లార్వాలు వృద్ధి కాకుండా అడ్డుకుంటాయని ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో కిరోసిన్ లేదా వ్యర్థ ఆయిల్ ను చల్లుకోవాలని దాని వలన ప్రమాదకర దోమలు అంతరించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ పుల్లయ్య, ఐ సి డి ఎస్ సిడిపిఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి గంగరాజు, సాపిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అహ్మద్ అలీ. మార్కెట్ కమిటీ సభ్యుడు సాల్మన్ రాజు, మాజీ మండల అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి, ఓబుళ్ల నేని నరసింహారావు, యస్ ఏ ఆసిఫ్, పొదిలి రామారావు, సురేష్ చౌదరి, ముత్యాల శ్రీరామ్, కూటమి నాయకులు చిట్టిబాబు, మడివి రాజు, ఆశ వర్కర్లు. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.(Story : పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి సోపానం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version