Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నానో యూరియా, నానో డిఎపి లతో ఖర్చు ఆదా

నానో యూరియా, నానో డిఎపి లతో ఖర్చు ఆదా

0

నానో యూరియా, నానో డిఎపి లతో ఖర్చు ఆదా

న్యూస్ తెలుగు/సాలూరు : నానో యూరియా, నానో డిఎపి లను రైతులు వినియోగించడం వలన ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు సాధించ వచ్చునని సాలూరు వ్యవసాయ అధికారి కే శిరీష తెలిపారు శనివారం సాలూరు మండలం కరడవలస గ్రామంలో మండల వ్యవసాయ అధికారి ఆమె ఆధ్వర్యం లో పొలంబడి అనే వ్యవసాయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయ ఆమె మాట్లాడుతూ రైతులు నానో యూరియా మరియు నానో డిఏపి లను వినియోగించడం వలన రైతులకు సమయము మరియు కూలీల ఖర్చులు ఆదా అవ్వడమే కాకుండా నానో ఎరువులు సులభంగా పంటలకు పిచికారీచేసుకునే వీలుకలుగుతుందని అలానే ఎరువుల వినియోగం పంటకు అధిక శాతంగా ఉంటుందని తెలియచేశారు. అలానే నానో ఎరువులు వినియోగం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని రైతులు కాపాడినవారు అవుతారని తెలియచేశారు దీనితో పాటు పంటల తెగుళ్ల నివారణ లో బాగంగా సుడోమొనాస్ అను సిలీంద్రాన్ని (పౌడర్) ని వినియోగించడం వలన పంటకు సోకే తెగుళ్లు నియంత్రణలో ఉంటాయని తద్వారా పంట ఆరోగ్యంగా పెరుగుతుందని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో కరడవలస సర్పంచ్ శంకర్రావు ఏఈఓ శ్రీను, వివోఏ బాలకృష్ణ ఇతర సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.(Story : నానో యూరియా, నానో డిఎపి లతో ఖర్చు ఆదా  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version