2025 ఫోటోగ్రఫీ కాంపిటేషన్
న్యూస్ తెలుగు / వినుకొండ : 186 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా డాక్టర్ ఎన్ భగవాన్ దాస్, బండి రాజన్ బాబు మెమోరియల్ ఫోటోగ్రఫీ కాంపిటేషన్ 2025 ఫోటో జనిక్ ఆర్ట్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఫోటో కాంటెస్ట్ లో వినుకొండ ఫోటోగ్రాఫర్ కేసనపల్లి సుబ్బారావు నలుపు తెలుపు ఒక విభాగంలో “బుల్ కాంపిటేషన్” ఫోటోకి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది, ఫోటో జనిక్ ఆర్ట్ సర్కిల్ సెక్రటరీ కానల సుధాకర్ రెడ్డి మెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని ఫోటోగ్రాఫర్లు, అసోసియేషన్ కార్యదర్శి రాయల శ్రీకాంత్, యార్లగడ్డ బుజ్జి, గోవడా శ్రీనివాసరావు, బ్రహ్మం, శ్యామ్, సీపీ, కన్నయ్య, బాజి, యార్లగడ్డ చంద్ర శేఖర్ ఆజాద్, తదితరులు కేసనపల్లి సుబ్బారావును అభినందించారు. (Story:2025 ఫోటోగ్రఫీ కాంపిటేషన్)

