Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధం

అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధం

0

అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధం

టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలను ఖండించిన
వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు 
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

న్యూస్ తెలుగు /వినుకొండ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రాజా, నాయకులు బిక్కి నరేంద్ర, కళ్ళం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం అన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడిన అసత్య ప్రచారాన్ని ఖందించారు. గతంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంబధించి శిలాఫల కాలు మార్చకోవడం, అక్రమ కేసులు బనాయించడం, 60 ఏళ్లు పైబడిన వృద్ధుడిపై లైంగికదాడి కేసులు నమోదు చేయడం వంటి దుర్మార్గపు చర్యలు తప్ప ఎక్కడా ఈ వినుకొండ లో అభివృద్ధి జరిగిన దాఖ లాలు లేవని విమర్శించారు. ఆగస్టు 15వ తేదీన ఛీప్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జాతీయజెండాను చెప్పులతో తొక్కి అవమానించడం నియోజకవర్గ మరియు రాష్ట్రం ప్రజలంతా చూశారని, పైపెచ్చు ఆ ఫొటోలు టీడీపీ కార్యాలయం నుంచి ప్రచారం చేసింది మీరుకాదా అని ప్రశ్నించారు. ఆఘటనను మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఖండిస్తే మా నాయకులపై ప్రేలాపనలు పేలడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవీ తాను పొరపాటుగా జాతీయజెండాను తొక్కానని, అందుకు క్షమించాలని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ క్షమాపణ కోరారన్నారు. అదికూడా గమనించకుండా టీడీపీ కార్యాలయం నుంచి మళ్లీ వైఎస్సార్ నాయకులను రెచ్చగొడుతూ పోస్టులు పెట్టడంపై ఖండించారు. నియోజకవర్గ యూత్ కన్వీనర్ సురబత్తుని రాజా ఆద్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన వినుకొండ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి కళ్ళం అనిల్ కుమార్ రెడ్డి, వినుకొండ మండలం యూత్ అధ్యక్షులు బిక్కి నరేంద్ర, ఈపూరు మండలం యూత్ అధ్యక్షులు రాజేష్, శావల్యాపురం మండలం యూత్ అధ్యక్షులు బొల్లా సుబ్బారావు టౌన్ యూత్ అధ్యక్షులు నర్రా చరణ్, విద్యార్థి విభాగ అధ్యక్షుడు జోయల్ మరియు తదితరులు, పాల్గొన్నారు. (Story:అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version