Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చింతూరు పోలీస్ వారి హెచ్చరిక

చింతూరు పోలీస్ వారి హెచ్చరిక

0

చింతూరు పోలీస్ వారి హెచ్చరిక

న్యూస్ తెలుగు/చింతూరు : అల్లూరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చింతూరు మండలం, మోతుగూడెం, డొంకరాయి ఎగువ ప్రాంతాల్లో వాగులు పొంగి ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉండని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ . గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలో ప్రజలు ఎవరు వాగులు దాటటం, చేపలు పట్టడం చేయరాదు.. కొండవాగులు ప్రవాహం ఉధృతిగా ఉందండంతో వాగుల వైపు వెళ్ళరాదని హెచ్చరించారు. అలాగే మోతుగూడెం పర్యాటక ప్రాంతాలు ఉన్నతాధికారుల ఆదేశాలతో తాత్కాలికంగా ముసివేయడం జరిగిందన్నారు. పర్యాటకులు గమనించాలని ఆయన అన్నారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో మారేడుమిల్లి నుండి భద్రాచలం ఘాట్ రోడ్డులో ప్రయాణాలు చేయరాదాని, అత్యవసర మైతే తప్ప ప్రయాణలు చేయరాదాని హెచ్చరించారు. అలాగే ఈ వర్షాల నేపథ్యంలో ఆరోగ్యాపరమైన తగు జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండవలసిందిగా ఆయన కోరారు.
సి ఐ నెంబర్ 9281442982
ఎస్ ఐ నెంబర్ 9182609596
సంప్రదించాలనికోరారు.(Story : చింతూరు పోలీస్ వారి హెచ్చరిక )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version