Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వర్షాల కారణంగా ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల మధ్య స్పందించిన రాకపోకలు రాకపోకలు

వర్షాల కారణంగా ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల మధ్య స్పందించిన రాకపోకలు రాకపోకలు

0

వర్షాల కారణంగా ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల మధ్య స్పందించిన రాకపోకలు రాకపోకలు

చింతూరు విఆర్ పురం మండలాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు

న్యూస్ తెలుగు/ చింతూరు :అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చత్తీస్గడ్, ఒరిస్సాలో కురుస్తున్న వర్షాలకు శబరి నది, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల చిన్న చిన్న వాగులు ఎగపోటుకు గురవుతున్నాయి. చింతూరు నుండి ఒరిస్సా వెళ్లే మార్గంలో కుయగురు గ్రామం వద్ద శబరి నది ఎగ పోటు గురవటంతో కూయ్గురు ఎగపోటు కు గురయింది. దీనివల్ల జాతీయ రహదారి(326)పై నీరు చేరటంతో ఆంధ్రప్రదేశ్ కు, ఒరిస్సా కు రాకపోకలు స్తంభించిపోయాయి. అలాగే చింతూరుకు విఆర్ పురం మండలాలకు మధ్యన గల సోకిలేరు పొంగి ప్రవహించటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇంతేగాక వి ఆర్ పురం లోని అన్నవరం గ్రామం వద్ద వాగు పొంగి ప్రవహించడంతో వంతెన కొట్టుకుపోయింది. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల కోడేరు, పెద్ద సీతనపల్లి, రామవరం, కుందులూరు తదితర పంచాయతీలోని సుమారు 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆయా పంచాయతీల లోని గర్భిణీ స్త్రీలను ఆశా వర్కర్ల సహాయంతో చింతూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోకులేరు వాగు వద్ద ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్, చింతూరు అడిషనల్ ఎస్పీ పంకాజ్ కుమార్ మీనా సందర్శించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల్లో ప్రజలు సాహసించి వెళ్ళరాదని, వరద ఉధృతంగా ఉన్న వేళ చేపలు పట్టడం కూడా నిషేధమని పేర్కొన్నారు. భద్రాచలం నుండి చింతూరుకు వచ్చే జాతీయ రహదారి (30) పై కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వంతెనలు వర్షాకాలం ప్రారంభం చేయటంతో అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయి దాని పైనుండి వరద ప్రవాహం అధికంగా ప్రవహించటంతో ఏడుగురాళ్లపల్లి సమీపాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అలాగే కూనవరం నుండి నెల్లిపాక మధ్యన గోదావరి ఎగపోటు గురై రాకపోకలు ఒక్కోసారి నిలిచిపోతున్నాయి.(Story:వర్షాల కారణంగా ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల మధ్య స్పందించిన రాకపోకలు రాకపోకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version