గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలింపు

న్యూస్ తెలుగు/ చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని ముకునూరు గ్రామం వద్ద సోకులేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా చింతూరు నుండి విఆర్ పురం వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం 9 గంటల నుండి రాకపోకలు స్తంభించాయి . దీనితో రంపచోడవరం నియోజకవర్గం శాసన సభ్యురాలు. శ్రీమతి మిరియాల శిరీష దేవి ఆదేశాల మేరకు. టిడిపి సీనియర్ నాయకులు ఎండి జాహంగీర్, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఎండి జమాల్ ఖాన్ సూచనల మేరకు సోమవారం
ఎనిమిది మంది లోతట్టు గ్రామాలై న ఏజీ కోడేరు, రామన్నపాలెం,పెద్ద సీతనపల్లి తదితర గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను ఆశా వర్కర్ల సహాయంతో పడవ మీద చుటూరు గ్రామనికి తరలించి, అచటి నుండి అంబులెన్స్ సహాయంతో చింతూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (Story:గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలింపు)