Homeవార్తలుతెలంగాణదళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: మోష

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: మోష

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: మోష

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి:
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోష కోరారు. వనపర్తి ఏఐటియుసి ఆఫీసులో జిల్లా స్వీపర్ల సమావేశంలో మాట్లాడారు. దళారుల పైరవీలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ఉద్యోగాలను పర్మెంటు చేస్తామని కొందరు ఒక్కొక్క స్వీపర్ దగ్గర రూ. 5200 వసూలు చేశారన్నారు. మోసగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. యూనియన్ పోరాటంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 12 నెలల పెండింగ్ వేతనం పొందగలిగామన్నారు. కొందరు స్వీపర్ల నెల జీతం రూ. 1623, మరికొందరికి రూ. 4000 ఉండేదని యూనియన్ పోరాటంతో ప్రభుత్వం రూ. 5200 కు పెంచిందన్నారు. ఉద్యోగాల పెర్మనెంట్, కనీస వేతనం రూ. 26 వేలు, ప్రతి నెల ఒకటో తేదీన వేతనం కోసం పోరాటం సాగిద్దాం అన్నారు. ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, భాస్కర్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ , లక్ష్మీనారాయణ, స్వీపర్లు పాల్గొన్నారు. (Story:దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: మోష)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments