ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ప్రశంసాపత్రాలు
న్యూస్ తెలుగు/సాలూరు : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పాత్ర అమూల్యమైనదని ఆంధ్రప్రదేశ్ శ్రీ శివ సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది అందిస్తున్న సేవలు, నిబద్ధత, సమయపాలన గుర్తించి, వారికి ప్రశంసాపత్రాలు బహూకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవకు ప్రభుత్వం గుర్తించి ఇలాంటి ఇలాంటి ప్రశంసా పత్రాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.భవిష్యత్తులో మరింత నాణ్యమైన ఆరోగ్యసేవలు అందించడానికి ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు.
సేవాభావం, క్రమశిక్షణ, సమయపాలనతో పనిచేయాలని సిబ్బందికి తెలియజేశారు
కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు, టిడిపి నాయకులు వైకుంఠపు హర్ష పప్పుల మోహన్ రావు, కాల్ల శ్రీను, అక్కిన అప్పారావు, వైద్యాధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు. (Story:ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ప్రశంసాపత్రాలు)

