Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రకృతి వ్యవసాయ బయో గ్రామాలు బలోపేతం చేయాలి

ప్రకృతి వ్యవసాయ బయో గ్రామాలు బలోపేతం చేయాలి

ప్రకృతి వ్యవసాయ బయో గ్రామాలు బలోపేతం చేయాలి

న్యూస్ తెలుగు/సాలూరు : ప్రకృతి వ్యవసాయ బయో గ్రామాలు బలోపేతం చేయాలి : డీపీఎం ఎమ్. శ్రవణ్ కుమార్ నాయుడు తెలిపారు మంగళవారంపార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల వ్యవసాయ ఎడిఎ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఎమ్. శ్రవణ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి. పారినాయుడు ప్రకృతి వ్యవసాయ డివిజనల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు మాట్లాడుతూ మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇంచార్జిలతో బయో గ్రామాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రకృతి వ్యవసాయ ప్రభందుకులు శ్రవణ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం అనుభందశాఖ అయినటువంటి నీతి అయోగ్ మన్యం జిల్లాను ప్రకృతి వ్యవసాయ ఆశజనక జిల్లాగా ఎంపిక చేయడం గర్వకారణంగా ఉందని, ఇందుకు ప్రతీ ప్రకృతి వ్యవసాయ కార్యకర్త రైతులకు అందుబాటులో ఉంటూ వారు ప్రకృతికి హాని చేసే విధమైన విష పదార్థాలు ఉపయోగించకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సహజ పంటలు పండించుకుని ప్రకృతిని భూమాతను, సకల జీవరాశులను, అందరి ఆరోగ్యాలను కాపాడవలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆనందకరమైన విషయమని ఆయన అన్నారు. మక్కువ సాలూరు పాచిపెంట మండలాల్లో కొన్ని గిరిజన గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లాలో అధిక గ్రామాలను బయో గ్రామాలుగా మార్చడానికి ప్రణాళికలు తయారు చేసి అందరి సహకారంతో ఆచరించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. ఈ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ డీ పారినాయుడు మాట్లాడుతూ గతంలో 2018 సంవత్సరంలో కురుపాం మండలంలోని కొండ బారిడి గ్రామంలోని మొత్తం 72 మంది రైతులు వారి యొక్క పూర్తి విస్తీర్ణం 262 ఎకరాలు ఏ విధమైన రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా సహజంగా లభించే వనరులను నవధాన్యాలను జీవామృతాలను ఉపయోగించుకొని జరిగిందన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం సాలూరు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో బయోగ్రామాలుగా బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏ దేవి ప్రసాద్, మాస్టర్ ట్రైనర్ .పి.యశోదమ్మ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.(Story : ప్రకృతి వ్యవసాయ బయో గ్రామాలు బలోపేతం చేయాలి  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!