Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పేదల ప్రాణాలను కాపాడుతున్న సీఎం సహాయనిధి

పేదల ప్రాణాలను కాపాడుతున్న సీఎం సహాయనిధి

0

పేదల ప్రాణాలను కాపాడుతున్న సీఎం సహాయనిధి

– 14 నెలలో 5 కోట్లతో 733 మంది పేద కుటుంబాలను ఆదుకున్న కూటమి ప్రభుత్వం 

– రాష్ట్రంలో విద్య వైద్యానికి పెద్దపీట 

– ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు

న్యూస్ తెలుగు/వినుకొండ :   కూటమి పాలనలో వేలాదిమంది పేద కుటుంబాలను సీఎం సహాయనిది ఆదుకొని ప్రాణాలు కాపాడుతున్నదని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు  జీవి ఆంజనేయులు అన్నారు. మంగళవారం పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ.  గతంలో మరే ప్రభుత్వం ఇవ్వనంతస్థాయిలో  సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయించి బాదిత పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. అనారోగ్యం బారిన పడి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుంది అన్నారు. గత వైసిపి ప్రభుత్వం 5 ఏళ్లలో 450 కోట్లు సీఎంఆర్ఎఫ్ కి ఖర్చు చేస్తే, 14 నెలల కూటమి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనారోగ్య బారిన పడిన  వేలాదిమంది బడుగు బలహీన వర్గాల పేదలను 500 కోట్ల సహాయంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకోవడం జరిగిందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో 733 మంది బాధితులకు 5 కోట్ల 18 లక్షలు ఇవ్వటం జరిగిందని, మంగళవారం 89 మంది బాదిత కుటుంబాలకు 63 లక్షల 19వేలు సీఎం సహాయ నిధి చెక్కులు అందించినట్లు తెలిపారు.  గత వైసిపి పాలనలో రాష్ట్రమంతా అరాచకం, అవినీతి, దోపిడితో సర్వనాశనం చేస్తే, నేడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం దిశగా పయనిస్తూ వైద్యం విద్యకు పెద్దపీట వేశారన్నారు. మంత్రి నారా లోకేష్ బాబు నాణ్యమైన విద్యను అందిస్తూ, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ, టెక్నికల్ నాలెడ్జ్ ని అందిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సమర్థవంతమైన పాలనతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో 9.34 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని, దీని ద్వారా 10 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కలుగుతుందన్నారు. అనారోగ్య పరిస్థితులు మరింత భారం కాకూడదని ఆలోచనతో సీఎం సహాయ నిధిని అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలోజనసేన నాయకులు నాగ శ్రీనురాయల్ ,కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:పేదల ప్రాణాలను కాపాడుతున్న సీఎం సహాయనిధి)

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version