సీనియర్ కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పెబ్బేరు మండలం, బున్యాదిపురం, గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త వెంకట స్వామి అనారోగ్య కారణంగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని మనో ధైర్యాని కల్పించారు. మాజీ మంత్రి వెంట పెబ్బేరు మండల అధ్యక్షుడు వనం రాములు యాదవ్, మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి, గుడిసె మధు, ఎల్లస్వామి, మజీద్ గ్రామ అధ్యక్షుడు, మేకల గోవిందు ,మద్దిలేటి ,ఏసు ,ఎల్లస్వామి ,వేణు మేకల ఎల్లయ్య, చిన్న ఎల్లారెడ్డి, గొడుగు శాంతన్న , రామన్ గౌడ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. (Story:సీనియర్ కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి)
