Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆగస్టు 5వ తేదీన కరెంటు సబ్ స్టేషన్ ల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయండి

ఆగస్టు 5వ తేదీన కరెంటు సబ్ స్టేషన్ ల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయండి

0

ఆగస్టు 5వ తేదీన కరెంటు సబ్ స్టేషన్ ల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయండి

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించండి.

రాష్ట్ర ప్రభుత్వం
విద్యుత్ చార్జీల పెంపును వెంటనే విరమించుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వం అదానీ తో ప్రైవేటు సంస్థలతో స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను విరమించుకోవాలి.

నివాస గృహాలకు స్మార్ట్ మీటర్ల బిగింపును నిలిపివేయాలి.

మారుతి వరప్రసాద్, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి.

న్యూస్ తెలుగు/వినుకొండ  : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రజలకు వ్యతిరేకంగా ఆమోదించిన విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. దీని ఫలితంగా అనేక రాష్ట్రాలలో ప్రధానంగా ముందుగా మన రాష్ట్రంలో అదాని తో కుదిరిన విద్యుత్ ఒప్పందాల ఫలితంగా మన జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కరెంటు వారమని చెప్పుకొనుచు ప్రైవేటు ఆపరేటర్లు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రతి ఇంటికి వస్తున్నారని ప్రజలు ఆ స్మార్ట్ మీటర్లను మీ ఇళ్లకు బిగించకుండా వ్యతిరేకించాలని అలా బిగించిన ఎడల స్మార్ట్ మీటర్లను పగలగొట్టేస్తామని వచ్చిన వారికి తెలపాలని ఆయన తెలిపారు.ఈ స్మార్ట్ మీటర్లు మన ఇళ్లకు బిగిస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఈ మీటర్లు రోజులోని 24 గంటలలో పూటకొక రకంగా విద్యుత్ మీటర్ వేగం విద్యుత్ వాడకాన్ని బట్టి పెరుగుతుందని దానిని అదుపు చేసే విధానం మన వద్ద ఉండదని సెల్ఫోన్ రీఛార్జి చేసుకుంటే ఏ విధంగా రీఛార్జ్ అయిపోగానే సెల్ఫోన్ ఆగిపోతుందో ఆ విధంగా విద్యుత్ మీటర్ రీఛార్జి చేసుకోవలసి ఉంటుందని రీఛార్జ్ అయిపోగానే మన ఇంట్లో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో మనం అగమ్య గోచరంగా ఉండవలసి వస్తుందని ఇంకా చాలా ఇబ్బందులు ఈ స్మార్ట్ మీటర్లలో ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలప్పుడు మేము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచ బోము అని తెలిపి పదిహేను వేల కోట్ల రూపాయల కరెంటు చార్జీలు రాష్ట్ర ప్రజలపై పెంచడం అన్యాయమని, అదా నీతో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా ఈ స్మార్ట్ మీటర్ల వెల సుమారుగా 7వేల రూపాయల నుండి 14 వేల రూపాయల వరకు ఉంటుందని, ఈ డబ్బును ప్రతి నెల మనం కట్టే కరెంటు బిల్లుల రీఛార్జిలో కట్ చేసుకుంటారని ఇప్పటికే మనం కడుతున్న కరెంటు బిల్లులలో అనేక రకాల ట్రూ అప్ చార్జీలు, సర్వీసు చార్జీలు, బకాయిల చార్జీలు, పెనాల్టీలు, గత ప్రభుత్వం విధించిన అనేక రకాల చార్జీలను ఇప్పటికే మనం కట్టలేక పేద ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు అన్యాయంగా మరలా కరెంటు చార్జిలు పెంచడమే కాక అదాని ఒప్పందాల స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్న నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇతర వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఆగస్టు నెల 5వ తేదీన వినుకొండ నియోజకవర్గం పట్టణం లోని అన్ని కరెంటు సబ్ స్టేషన్ ల వద్ద ప్రజలను ఇబ్బంది పెట్టే కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ అదాని స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను గృహాలకు బిగించవద్దని కరెంటు సబ్ స్టేషన్ ల వద్ద జరిగే నిరసన ధర్నాలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజలను ఆయన కోరారు.(Story : ఆగస్టు 5వ తేదీన కరెంటు సబ్ స్టేషన్ ల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version