Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కరడవలస గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

కరడవలస గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

0

కరడవలస గ్రామంలో

పొలం పిలుస్తుంది కార్యక్రమం

న్యూస్ తెలుగు/సాలూరు : రైతులు పురుగులు మందులు కొట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అలా పాటించకపోతే అనారోగ్యానికి గురువుతారని సాలూరు మండల వ్యవసాయ అధికారి కె శిరీష అన్నారు. మంగళవారం సాలూరు మండలం కరడవలస గ్రామంలో లో పొలం పిలుస్తుంది మరియు వరి పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ రైతులు రసాయన పురుగు మందులు వలన పిచికారీ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కలిగే అనర్థాలు ఒక నమూనా చిత్రపటం చూపించడం ద్వారా వివరించడం జరిగింది.అలానే రైతులకు పొలంబడి కార్యక్రమం లో భాగంగా పంటలకు హానిచేసే శత్రు కీటకములు మరియు పంటలకు మేలు చేసే మిత్ర కీటకములు గురించి వివరించడం జరిగింది. తదుపరి రైతుల అవగాహన నిమిత్తం ఒక నమూనా పరీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రైతులకు వరి మరియు మొక్కజొన్న పంటల ఎరువుల యాజమాన్యం మరియు పంట సాగు విధానాలు వివరించడం జరిగింది అలానే రైతులకు ప్రకృతి సేద్యం వలన కలిగే ప్రయోజనాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ సహాయకులు హాజరు కావడం జరిగింది. (Story:కరడవలస గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version