Home వార్తలు  ‘మిరాయ్’ నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్ 

 ‘మిరాయ్’ నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్ 

0

 ‘మిరాయ్’ నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్ 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా,  ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మిరాయ్‌’లో సూపర్ యోధగా అలరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి సింగిల్ వైబ్ ఉంది ప్రోమో సంచలనం సృష్టించింది. ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇప్పుడు, టీం సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేసింది.

వైబ్ ఉంది తుఫానులా మిమ్మల్ని తాకే మ్యూజికల్ వైబ్, పవర్ ఫుల్ కంపోజిషన్ తో సాంగ్ అదిరిపోయింది. ఈ ట్రాక్‌లో అకార్డియన్లు, సాక్సోఫోన్లు, పవర్ ఫుల్ డ్రమ్స్  హై-ఆక్టేన్ ఎనర్జీని క్రియేట్ చేశాయి. కృష్ణకాంత్ లిరిక్స్ తెలుగు, ఇంగ్లీషులను నేచురల్ గా బ్లెండ్ చేసి హీరో ఎమోషన్‌ని,  హీరోయిన్ అందాన్ని అద్భుతంగా హైలైట్ చేశాయి.

తేజా సజ్జా ప్రతి ఫ్రేమ్‌లో ఎనర్జీ, ఛార్మ్, డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టాడు. డ్యాన్స్ మూమెంట్స్ లో అతని గ్రేస్ మెస్మరైజ్ చేసింది.

అర్మాన్ మాలిక్ మాజిక్ వోకల్స్ తో ఆకట్టుకున్నాడు. సాఫ్ట్‌గా, అలాగే హై బీట్‌కి తగ్గట్టే పవర్ఫుల్‌గా పాడాడు.

విజువల్ గా పాట నెక్స్ట్ లెవల్ లో వుంది. అర్బన్ సెట్టింగ్‌లో, స్టైలిష్ షాట్స్, లైటింగ్,  డిజైన్ చూస్తుంటే అద్భుతం అనిపించింది. తేజ-రితికా నాయక్ కెమిస్ట్రీ, డాన్స్ మూమెంట్స్ అలరించారు. తేజ స్టైల్ గ్రేస్ టాప్ గేర్‌లో ఉంది. రుతికా గ్లామరస్‌గా కిల్లింగ్ లుక్ లో మెరిసిపోతుంది.

మొత్తానికి ట్రెండీ టచ్‌తో పాటు చిన్న క్లాసికల్ హింట్స్‌తో వైబ్ ఉంది పాట మాస్‌ని, క్లాస్‌ని రెండిటినీ కనెక్ట్ చేస్తోంది. వైబ్ ఉంది అన్ని మ్యూజిక్ చార్ట్స్ తో టాప్ లో ఉండబోతోంది.

మనోజ్ మంచు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. శ్రీయ శరణ్, జయరామ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

సెప్టెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది. 2D, 3D ఫార్మాట్లలో 8 భాషల్లో థియేటర్లలోకి వస్తుంది.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు

సాంకేతిక బృందం:
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రైటర్: మణిబాబు కరణం
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్టాగ్ మీడియా (Story: ‘మిరాయ్’ నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version