Home వార్తలు తెలంగాణ విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

0

విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

భవిష్యత్ మార్గాలకు విద్యార్థి దశేకీలకం

ఉన్నత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలి

pm శ్రీ బెస్ట్ పాఠశాలగా చిట్యాల mjp గురుకుల పాఠశాల ఎంపిక

శిలాఫలకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి  :వనపర్తి మండలం చిట్యాల లో గల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల PM శ్రీ నిర్వహణలో జాతీయస్థాయిలో బెస్ట్ పాఠశాలగా గుర్తింపు పొందింది

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంగళవారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ప్రారంభించారు

ఎడ్యుకేషనల్ పాలసీ ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు

గత పదేళ్ల BRS పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయిందని నేను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో పటిష్ట పరుస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు

ఈ విద్యా సంవత్సరంలో మునిపెన్నడూ లేని విధంగా పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తువులు నెలరోజుల ముందే పాఠశాలలకు చేరాయన్నారు

అదేవిధంగా వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు 40 శాతం మెస్ ఛార్జీలు పెంచి విద్యార్థుల ఇబ్బందులను తొలగించిందని ఎమ్మెల్యే తెలిపారు

“pm శ్రీ “పాఠశాల నిర్వహణలో జాతీయస్థాయిలోనే మంచి గుర్తింపు పొందేందుకు కృషిచేసిన పాఠశాల ఆయన ప్రశంసించారు

పాఠశాల సమస్యలను పరిష్కరిస్తామని అత్యవసరంగా రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు

కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డీఈఓ అబ్దుల్ గని ,పాఠశాల ప్రిన్సిపాల్ గురువయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి కిరణ్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిచరణ్ రెడ్డి, రఘుపతిరావు,
బి కృష్ణ, ex mpp శంకర్ నాయక్, నాగవరం యాదయ్య, వాల్య నాయక్, ఎత్తుం రవికుమార్, కర్ణాకర్, వెంకటేష్,కుమార్, నరసింహ, తోట రాము తదితరులు పాల్గొన్నారు. (Story:విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version