శక్తియాప్ ను వినియోగించండి ఆపదల నుండి గట్టెక్కండి.
న్యూస్ తెలుగు / చింతూరు : శక్తి యాప్ ను ఉపయోగించుకొని ఆపదల నుండి గట్టెక్కాలని కానిస్టేబుల్ రాజమణి విద్యార్థినుల ఉద్దేశించి పిలుపునిచ్చారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాల పట్ల జాగ్రత్తగా మెలగాలని సూచించారు. స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బుధవారం స్థానిక సీఐ తెల్లం దుర్గాప్రసాద్, ఎస్సై పి రమేష్ ఆదేశాల మేరకు, పోలీస్ సిబ్బంది ఓ యువత మేలుకో జీవితాన్ని నిలుపుకో అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ కె రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో మాట్లాడుతూ యువత ప్రవర్తన సమాజంపై ప్రతిబింబిస్తుందని అందుకే విద్యార్థులు నైతిక విలువలు పాటించి మంచి జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి సత్ప్రవర్తన కలిగి సమాజానికి కళాశాలకు తల్లిదండ్రులకు ఆదర్శంగా మెలగాలని కోరారు. విద్య తోనే వినయం, సత్ప్రవర్తన కలుగుతాయన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ చంద్ర య్య మాట్లాడుతూ కాలేజీల్లో విద్యార్థులు మొబైల్ వాడకాన్ని మంచి విజ్ఞానం కోసమే వినియోగించుకోవాలని కోరారు. అలాగే మత్తు పదార్థాల జోలికి విద్యార్థులువెళ్ళ రాదని, గంజాయి, గుట్కా, పొగాకు తో తయారయ్యే వస్తువుల జోలికి వెళ్లరాదని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు జె సుశీల, దాసరి శ్రీనివాసరావు,కె. గణేష్, ఆర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.(Story : శక్తియాప్ ను వినియోగించండి ఆపదల నుండి గట్టెక్కండి. )
