Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చండి

ఇచ్చిన హామీలు నెరవేర్చండి

0

ఇచ్చిన హామీలు నెరవేర్చండి

న్యూస్ తెలుగు /సాలూరు : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకుని నిలదీయండి అని లోకేష్ అన్నాడు. ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారు మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర కూటమి నాయకులను డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని నిలదీయండి అని ఆనాడు లోకేష్ ఒక టీవీ ఇంటర్వ్యూలో అన్నాడని. ఆడబిడ్డ నిధి 1500 ఇస్తామన్న హామీ కూటమి ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు ఇస్తారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం వచ్చి ఒక ఒక సంవత్సరం అవుతుందని, రాష్ట్రంలో మహిళ ఓటర్లు సుమారు రెండు కోట్ల 10 లక్షల మంది ఉన్నారని ఇందులో18 సంవత్సరాలు నిండిన 59 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలు కోటి 50 లక్షల మంది కి ప్రతినెల 1500 రూపాయలు మొత్తం ఒక సంవత్సరానికి 18 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని ఆ హామీ ఎక్కడ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ , మంత్రి సంధ్యారాణిని ప్రశ్నించారు. తాజాగా ఆడబడ్డ నిధి పథకం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళ పాలెం సుపరిపాలన తొలి అడుగు సభలో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఆదాయం ఉద్యోగస్తుల జీతాలు కి పెన్షన్లకి అయిపోతుందని అనడం ఆనాడు ఈ హామీ ఇచ్చినప్పుడు గుర్తులేదా అని కుటమి నాయకులను ప్రశ్నించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి మహిళలకు ఇచ్చిన ఈ హామీ ఎప్పుడు నెరవేరుస్తారని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సహించేది లేదని అన్నారు. శ్రీ శిశు సంక్షేమ మంత్రిగా సంధ్యారాణి ఎన్నికల్లో గెలవడానికి నియోజకవర్గంలో ఎన్నో హామీలు ఇచ్చారని ఈ హామీలు తో పాటు ఆడబిడ్డ నిది హామీ కూడా అమలు చేసేందుకు చొరవ చూపాలని అన్నారు. ఈ హామీని అమలు చేయకపోతే మహిళలు మోసం చేసినట్లేనని అన్నారు. (Story:ఇచ్చిన హామీలు నెరవేర్చండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version