Home వార్తలు తెలంగాణ భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలి

భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలి

0

భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.బుధవారం వీపనగండ్ల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆకస్మితంగా తనిఖీ చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోపు మెజారిటీ దరఖాస్తులను పూర్తి చేసే విధంగా పనిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెండింగ్ మ్యూటేషన్, సక్సేషన్ వంటి తదితర దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగుల ఓపి రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రసవాలకు సంబంధించిన రిజిస్టర్ ను తనిఖీ చేసిన కలెక్టర్.. ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. చిన్న పిల్లలకు ఎప్పటికప్పుడు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, అందుకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు ఆదేశించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ ను పరిశీలించిన కలెక్టర్ స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వైద్య సేవలను పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, తహసిల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.(Story : భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version