సుపరిపాలనే తమ ధ్యేయం
న్యూస్ తెలుగు/ వినుకొండ : ఏడాది సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ప్రభుత్వ చీఫ్ విప్పు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు స్థానిక 11వ వార్డులోని రైలు పేట మసీదు మాన్యం ఆజాద్ నగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆజాద్ నగర్ వాసులు పలు సమస్యలను జీవీ దృష్టికి తెచ్చారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని. విద్యుత్తు శాశ్వత పరిష్కారం చేపట్టాలని ఇలా పలు సమస్యలనుజీవీ దృష్టికి తెచ్చారు/(Story:సుపరిపాలనే తమ ధ్యేయం )

