Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆ పాపం ఉట్టినే పోదు..

ఆ పాపం ఉట్టినే పోదు..

0

ఆ పాపం ఉట్టినే పోదు..

న్యూస్ తెలుగు /సాలూరు :  చంద్రబాబు బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేలాదిమంది చిరుద్యోగులను తొలగించారని ఆ పాపం ఉట్టినే పోదని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర అన్నారు. సోమవారం సాలూరు మండలం కురుకుటి గ్రామంలో బాబు షూరీటి – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మొదట
గ్రామ ప్రజలు, నాయకులు భారీ ఎత్తున ఘనస్వాగతం ఫలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గ్రామ వాలంటీర్స్ కు అధికారంలోకి వస్తే జీతం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారని ఆ వాగ్దానము ఎక్కడ బాబు అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని పూర్తిగా తొలగించారని అన్నారు.
సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబునాయుడు కె దక్కిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాదిమంది చిరు ఉద్యోగులను తొలగించారని ఆ <పాపం ఊట్టినే పోదని అన్నారు. ప్రజలందరూ ఆ ధైర్యం పడవద్దని రానున్న రోజులు మంచి రోజులు ఉన్నాయని అన్నారు. గిరి శిఖర గ్రామాలకు రోడ్లు వేస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్లు వేయలేదని అన్నారు.
కురుకూటి పంచాయతీలో ప్రతి ఇంటింటి కి వెళ్లి ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్, హామీలు, మోసం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీను, వైసిపి నాయకులు దండి శ్రీనివాసరావు, సువ్వాడ రామకృష్ణ, కల్లేపల్లి త్రినాధ, కురుకూటి ఎంపిటిసి, మువ్వల ఆదిత్య, సాంబ తదితరులు పాల్గొన్నారు. (Story:ఆ పాపం ఉట్టినే పోదు..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version