ఆగస్టు 6, 7 తేదీల్లో జరిగే సిపిఐ జిల్లా మహాసభ లను జయప్రదం చేయండి
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపు
న్యూస్ తెలుగు/ చింతూరు : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా 26వ మహాసభలు ఆగస్టు 6,7 తేదీలలో రాజమండ్రిలో జరుగుతున్నాయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో మహాసభ సన్నహాక సమావేశం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది
తాటిపాక మధు మాట్లాడుతూ ఆగస్టు 6తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక సిపిఐ కార్యాలయం నుండి మహా ప్రదర్శన ప్రారంభమవుతుందని ఆయన అన్నారు అదే రోజు సాయంత్రం 4 గంటలకు సుబ్రహ్మణ్యం మైదానం లో బహిరంగ సభ జరుగుతుందని దీనికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే.రామకృష్ణ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవివి. సత్యనారాయణమూర్తి జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవీంద్రనాథ్ తదితరులు ప్రసంగిస్తారని మధు అన్నారు
ఇంకా ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శివి కొండలరావు సహాయ కార్యదర్శి సప్పా రమణ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ జట్ల సంఘం అధికార బాడీ సభ్యులు పి దేముడు బాబు, బాలకృష్ణ, మహిళాసమాఖ్య అధ్యక్షులు కొండావతి సూర్త నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story:ఆగస్టు 6, 7 తేదీల్లో జరిగే సిపిఐ జిల్లా మహాసభ లను జయప్రదం చేయండి)
