Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌డ్రం సీడర్ విధానంతో ఖర్చులు తగ్గుతాయి

డ్రం సీడర్ విధానంతో ఖర్చులు తగ్గుతాయి

డ్రం సీడర్ విధానంతో ఖర్చులు తగ్గుతాయి

న్యూస్ తెలుగు/సాలూరు : డ్రం సీడర్ విధానంలో వరి నాటడం వలన ఎకరాకి 10,000 రూపాయలు ఖర్చులు తగ్గుతాయని సాలూరు వ్యవసాయ అధికారి కె శిరీష అన్నారు. శనివారం సాలూరు మండలం
మరుపల్లి పంచాయతీ, రేగాపు వలస గ్రామంలో రైతు రామకృష్ణ పొలంలో డ్రం సీడర్ విధానంలో వరి నాటడం కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విధానంలో ఎకరానికి 8 నుంచి 10 కేజీలు విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 12 గంటలు మండిగట్టి చిన్న మొలక వచ్చిన తర్వాత, ఈ విత్తనాన్ని బాగా దమ్ము చేసి,చదును చేసిన పొలంలో డ్రమ్ సిడర్ ఉపయోగించాలని తెలిపారు. ఇలా వరి విత్తనాలు విత్తడం వలన రైతులకు నారుతీత ఉడుపు ఖర్చులు తగ్గుతాయని అన్నారు. ఈ విధానంలో
ఎకరా విస్తీర్ణం లో ప్రధాన పంటలో కలుపు నివారణ కొరకు ప్రధాన పంటకు కావలసిన పోషకాలు కోసం పది కేజీలు పి ఎం డి ఎస్ విత్తనాలు మినుములు, నువ్వులు, ఉలవలు, బొబ్బర్లు, తోటకూర, గోంగూర విత్తనాలు ముందుగా ప్రయోగాత్మకంగా వేయుంచడం జరుగుతుందని తెలిపారు.వరి డ్రమ్ సీడర్ వరుస క్రమ పద్ధతి లో వెయ్యటం వలన వరి పిలకలు పెరిగి దుబ్బు సైజు పెరుగుతుందని తెలిపారు . వరి లైన్ సోయింగ్ లో పి ఎం డి ఎస్ విత్తనాలు వెయ్యటం వలన కలుపు నివారణ అవుతుందని అన్నారు. వేరు వ్యవస్థ ద్వారా నేల గుల్ల బారి సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది ప్రధాన పంటకు కావలిసిన పోషకాలు అందిస్తాయని చెప్పారు. వరి డ్రమ్ సీడర్ తో నాట్లు వెయ్యటం వలన ఒక ఎకరానికి ఎనిమిది వేల నుండి పదివేలు ఖర్చు తగ్గుతుందని అన్నారు. పంట దిగుబడి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎం టి యశోద, ఏ ఈ ఓ శ్రీను,రైతులు పాల్గొన్నారు. (Story:డ్రం సీడర్ విధానంతో ఖర్చులు తగ్గుతాయి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!