ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
న్యూస్ తెలుగు/ చింతూరు : చతిస్గడ్ రాష్ట్రంలోని సుకుమార్ జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో ముసలమడుగు గ్రామ సమీపంలోని అడవిలో మావోయిస్టులు దాచి ఉంచిన డంపు ను భద్రత భాల గాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాలపై పెద్ద దాడికి సన్నాహకంగా మావోయిస్టులు పెద్ద మొత్తంలో ధాచిన పేలుడు పదార్థాలను బలగాలు గుర్తించాయి. వాటిలో మందు గుండు సామాగ్రి, ఐ ఈ డికి ఉపయోగించే రసాయన పదార్థాలు, ఫ్యూ జ్ వైరు తదితర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జాయింట్ ఆపరేషన్ లో పోల్గొన్న సుక్మా డి ఆర్ జి బృందం, 50 బెటాలియన్, 219 బెటాలియన్ సి ఆర్ పి యఫ్ బలగాలు ఈ డంపును స్వాధీనం చేసుకున్నా యి. (Story:ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం)
