Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పారిశుద్ధ్య డ్రైవ్ పక్కాగా చేపట్టాలి

పారిశుద్ధ్య డ్రైవ్ పక్కాగా చేపట్టాలి

0

పారిశుద్ధ్య డ్రైవ్ పక్కాగా చేపట్టాలి

న్యూస్ తెలుగు/సాలూరు : జిల్లాలో పారిశుద్ధ్య డ్రైవ్ పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  గుమ్మిడి సంధ్యా రాణి పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య డ్రైవ్ పోస్టర్లను మంత్రి సాలూరులో బుధవారం
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామం పారిశుధ్య నిర్వహణలో ముందంజలో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రానున్న వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తికి, ప్రభలుటకు  ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అటువంటి పరిస్థితి నుండి దూరంగా ఉండుటకు పారిశుద్ధ్య అత్యావస్యమన్నారు. ప్రతి కుటుంబం  పారిశుద్ధ్య అవగాహన పెంపొందించుకోవాలని ఆమె కోరారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పూడికల తీత కార్యక్రమం చేపట్టాలని, బ్లీచింగ్ చల్లాలని, ఎక్కడా నీరు నిలువ లేకుండా తగు కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. గ్రామస్తులు పూర్తిగా అవగాహన పొందాలని ముఖ్యంగా దోమకాటుకు గురికాకుండా మలేరియా స్ప్రేయింగ్ చేయించుకోవాలని, దోమతెరలను వినియోగించాలని అదేవిధంగా నీటిని బాగా మరగకాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహార పదార్థాలను తినాలని ఆమె అన్నారు. పంచాయతీ సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది ఆయిల్ బాల్ వినియోగించడం,  ఫ్రైడే డ్రై డే గా పాటించడం చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యంగా ఉండే ప్రాంతాలు గుర్తించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తమర్భ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. (Story:పారిశుద్ధ్య డ్రైవ్ పక్కాగా చేపట్టాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version