Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ హింసను రెచ్చగొడుతున్న వైసీపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలి

హింసను రెచ్చగొడుతున్న వైసీపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలి

0

హింసను రెచ్చగొడుతున్న వైసీపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలి

ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తిగా మారిన వైసీపీకి ప్రజల తిరస్కారం తప్పదు
వినుకొండలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ

న్యూస్ తెలుగు / వినుకొండ : సమాజంలో హింసను రెచ్చగొడుతున్న వైసీపీ గుర్తింపును ఎన్నికల సంఘం తక్షణ రద్దు చేయాలని చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తిగా మారిన ఆ పార్టీకి ఎప్పటికైనా ప్రజల తిరస్కారం తప్పదన్న ఆయన ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం వినుకొండ పట్టణంలోని 3వ వార్డు ఇందిరానగర్‌లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారంలో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన తరఫున కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా, శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసే చర్యలు వైకాపా చేస్తున్న తీరును ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి, అని డిమాండ్ చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే హింసాప్రవృత్తిని ప్రదర్శించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను టార్గెట్ చేసి ప్రాణాలు తీశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాల కన్నా గుట్కా, డ్రగ్స్ అలవాటు చేయడమే జగన్ పాలనలో ప్రధానంగా మారిందని, కళాశాలల్లో గంజాయి అమ్మడమే కాక, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం విషం చిమ్మి ంది ఇంకా ఎవరు మరిచిపోలేదని ధ్వజమెత్తారు. అప్పట్లో జగన్ నిర్వాకానికి 35 లక్షల మందికి పైగా ఆసుపత్రుల పాలవ్వగా, 30 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇదే సందర్భంగా ఏడాదిలో కూటమి ప్రభుత్వ సాధించిన విజయాలనూ వివరించారు జీవీ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని, తొలినెలలోనే పింఛన్లు పెంచామన్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం రూపంలో ఫలితాలు ప్రజల ముందే ఉన్నాయన్నారు. జగన్ హయాంలో పరిశ్రమలు పారిపోతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే రూ.9.3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయన్నారు. వీటి ఫలితంగా 8.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని, అది భరించలేకనే జగన్ కడుపుమంటతో రగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. శాంతి, అభివృద్ధికి అడ్డుపడే అలాంటి పార్టీలకు దేశంలో స్థానం లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షకీలా దస్తగిరి, పీవీ సురేష్ బాబు, నాగూర్, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Story:హింసను రెచ్చగొడుతున్న వైసీపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version