Homeవార్తలుతెలంగాణకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి  రేవంత్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి  రేవంత్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి  రేవంత్ లక్ష్యం

న్యూస్‌తెలుగు/ వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తుడి మెఘా రెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వనపర్తి నియోజకవర్గంలోని ఆర్.జి. గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మెఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్ద పీఠ వేయడం జరుగుతుందన్నారు.

ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు పావల వడ్డీ రుణాలు అందించిందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మహిళలకు పావులా వడ్డీ రుణాలు అందించలేకపోయిందన్నారు. తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసిందన్నారు.
రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకం చేశారన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా బస్సులకు యజమానులను చేసేందుకు రాష్ట్రంలో మహిళా సంఘాలకు 1000 బస్సులను ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా వనపర్తి జిల్లాకు ఆరు బస్సులు రావడం జరిగిందన్నారు. ఇప్పుడు ఒక్కో బస్సు ద్వారా నెలకు రూ.69 వేలు అద్దె రూపంలో మహిళా సంఘాలకు ఆదాయయం సమకూరుతుందన్నారు.
ప్రతి జిల్లాలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మహిళా సమాఖ్య భవనం మంజూరు చేసింది అన్నారు.
వనపర్తి జిల్లాలో సైతం మహిళా సమాఖ్య భవనం నిర్మాణంలో ఉందని త్వరలోనే పూర్తి చేసి మహిళలకు అప్పజెప్పడం జరుగుతుందన్నారు.
500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇంకా ఎవరికైనా రానివారికి నెల రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి అర్హులందరికీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా 5 లక్షల రూపాయల ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలో 2 మెగా వాట్ ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకులు నిర్వహించి వాటి ద్వారా లబ్ధి చేకూర్చడానికి పెట్రోల్ బంకులు మంజూరు చేయడం జరిగింది.
మహిళా సంఘాలలో ఉన్న సభ్యులకు ఇకనుండి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల బీమా ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా లోన్ భీమా సైతం కల్పించడం జరిగింది. లోన్ తీసుకున్న మహిళా చనిపోతే లోన్ మాఫీ అవుతుందన్నారు.
రాష్ట్రంలో పేదలందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కొరకు ఎదురుచూస్తున్న మహిళలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. వనపర్తి జిల్లాలో 5350 కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలియజేశారు.
ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని ఇప్పుడు మంజూరైన వారందరూ వారందరూ ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి సారీ, పంచేతో గృహప్రవేశానికి వస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మంజూరు కానీ వారికి మలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పెళ్లి అయిన రెండు నెలల్లోనే అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఒక కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబంలో మహిళ విద్యావంతురాలు, ఆర్థిక స్వావలంబన పొంది ఉండాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పి.డి.డీఆర్డిఒ ఉమా దేవి వనపర్తి జిల్లాలో మహిళా సాధికారితకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
అనంతరం ప్రతి మండల సమాఖ్య నుంచి 5 మంది ఉత్తమ మహిళా సంఘాల సభ్యులకు సన్మానం చేశారు. 2025- 26 సంవత్సరానికి వడ్డీ లేని బ్యాంకు రుణాలు రూ.29.28 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు ఇచ్చారు.
మహిళా సంఘాలకు ప్రమాద బీమా, లోన్ భీమా చెక్కు రూ. 16,10,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అదరపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, పెబ్బేరు మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మాజీ ఎంపీపీ కిచ్చ రెడ్డి, శంకర్ ప్రసాద్, మండల సమాఖ్య అధ్యక్షులు సంధ్యారాణి, నిర్మల, స్వప్న, ఇందిరా, మహేశ్వరి, శాంతమ్మ, శ్రీలత రెడ్డి, ధనలక్ష్మి కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story:కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి  రేవంత్ లక్ష్యం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!