ఎంపీ డా: మల్లురవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ మల్లురవి గారి జన్మదిన సందర్భంగా సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల ఎంపీ నివాసం వద్ద ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉన్నత విద్యావంతుడు, పిలిస్తే పలికే నాయకుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు గా వ్యవహరిస్తూ నిరుపేదల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేసే డా: మల్లురవి మరెన్నో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బ్రహ్మం చారి, పెబ్బేరు మండల నాయకులు రంజిత్ కుమార్, యాపర్ల రామిరెడ్డి, పెద్దమందడి మహేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:ఎంపీ డా: మల్లురవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేఘారెడ్డి)

