ప్రజలందరూ ఒకటే అందరికీ ఒకే న్యాయం చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పాత బజారులోని రామాలయం ముందు రోడ్డుకు అడ్డంగా కట్టిన కాలువను ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ, గాంధీచౌక్ నుండి గోపాలపేట రోడ్ లో పేదల ఇళ్లు,పేదల గుళ్ళు,దర్గాలు, పేద ఆర్యవైశుల ఇళ్లను కూడా తొలగించారు వారు రోడ్డున పడ్డారు. ఆర్యవైశ్యుల ఫంక్షన్ హాల్ కాంపౌండ్ కూడా తొలగించారు. కానీ ఎలక్షన్ తరువాత ఎమ్మెల్యేకి సన్మానం చేసిన వెంటనే కాంపౌండ్ ను కట్టేశారు. చూసిన అందరూ ముక్కు పై వేలు వేసుకున్నారు. ఎమ్మెల్యే ఈ అపనిందలు మీపై వేసుకోకుండా చూడాలని, మీ వెంబడి ఉండే కొందరి నాయకుల ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారనీ ప్రజలు అంటున్నారు వెంటనే ఫంక్షన్ హల్ తొలగించి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి గర్భగుడి ముందు నుండి తొలగించి రోడ్డు వెడల్పు చేయగలరు. ప్రజలందరూ ఒకటే అందరికీ ఒకే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, రాజనగరం రామస్వామి, రాజనగరం రవి, కురుమూర్తి, నాగరాజు, పాత బజార్ వాసులు పాల్గొన్నారు. (Story:ప్రజలందరూ ఒకటే అందరికీ ఒకే న్యాయం చేయాలి)

