Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జీవీ పుట్టినరోజు సందర్భంగా  ఉచిత కంటి వైద్య శిబిరం

జీవీ పుట్టినరోజు సందర్భంగా  ఉచిత కంటి వైద్య శిబిరం

0

జీవీ పుట్టినరోజు సందర్భంగా  ఉచిత కంటి వైద్య శిబిరం

శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ – శంకర్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు

న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకుని వినుకొండలో నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పెదకాకానికి చెందిన ప్రసిద్ధ శంకర్ కంటి ఆస్పత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గంగినేని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఆయన సతీమణి, ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ లీలావతి, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ తన జన్మదినం సందర్ఫంగా ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమం నిర్వహిం చడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పదిమంది సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదని ఈ ఉచితకంటి వైద్య శిబిరం మరోసారి గుర్తు చేసిందన్నారు. దేవుడు, ప్రజలు ఇచ్చిన అవకాశంలో మూడవ సారి ఎమ్మెల్యేగా గెలవడం ఒకటైతే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో చీఫ్‌విప్‌గా కీలక బాధ్యతలు అందుకోవడం అన్నీ అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గంజాయి, గుట్కా లాంటి మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటూ, గూండాయిజం, రౌడీయిజానికి చెక్ పెట్టిందన్నారు. కానీ వైసీపీ పాలనలో యువత ఉద్యోగావ కాశాల కోసం ఎదురుచూస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని.. విద్యార్థులకు అమ్మఒడి సహాయం ఒక్కరికే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతి విద్యార్థికి రూ.13 వేలు అందిస్తున్నామని.. రెండు నెలల్లో కొత్త టీచర్లను నియమించనున్నట్టు తెలిపారు. ఇలా గత ప్రభుత్వం చేయలేని ఎన్నోమంచి పనులను ప్రభుత్వం చేస్తోందన్న జీవీ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నామని తెలిపారు. పెంచిన పింఛన్లతో పాటు రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, దాంతో 8.5 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్టు చెప్పారు. కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడుతూ…జీవీ ఆంజనేయులు కష్టాలు ఎదురీది ఎదిగిన నాయకుడని కితాబిచ్చారు. మూడోసారి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా సేవలు అందిస్తున్న ఆయను ఈ జన్మదిన వేడుకల నుంచి అంతా మంచే జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తా అన్నారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ నడిపిస్తున్న సేవా కార్యక్రమాలు గుంటూరు జిల్లాలో మంచి మార్పుకు నాంది పలుకుతున్నాయని తెలిపారు. వేలాదిమందికి కంటిచూపు ఇవ్వడం ఎంత గొప్పపని అని కొనియాడారు. ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ లీలావతి మాట్లాడు తూ జీవీ ప్రతి పుట్టినరోజును వినుకొండ ప్రజల మధ్యలో జరుపుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా జీవీ ఎప్పుడూ ప్రజలకోసమే పరితపిస్తుంటారని తెలిపారు. చదువుకోలేని విద్యార్థులకు సహాయం, పేదలకు వైద్యం, ప్రకృతి పరిరక్షణ కోసం మొక్కల పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండడం మా బాధ్యతగా భావిస్తున్నాం,” అని అన్నారు. కంటిచూపు బాగు చేయించడం ద్వారా ఎందరో జీవితాలు మారుతున్నాయని . అందుకే ఈ తరహా శిబిరాలను ప్రతి మండలంలో ప్రతి రెండు నెలలకోసారి నిర్వహిస్తామని.. సీఎం చంద్రబాబు పీ-4 లక్ష్యాన్ని శివశక్తి ఫౌండేషన్ ముందుండి ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నారు. ఈ శిబిరానికి వందల మంది ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్ లకు సూచనలు కూడా అందించారు.(Story:జీవీ పుట్టినరోజు సందర్భంగా  ఉచిత కంటి వైద్య శిబిరం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version