Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఉత్సాహపూరిత వాతావరణం లో ఘనంగా సిపిఐ  మహాసభ

ఉత్సాహపూరిత వాతావరణం లో ఘనంగా సిపిఐ  మహాసభ

0

ఉత్సాహపూరిత వాతావరణం లో ఘనంగా సిపిఐ  మహాసభ

ఆగస్టు 7, 8 తేదీలలో జరుగనున్న సిపిఐ పల్నాడు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి
 వాగ్దానాలు అమలు చేసే వరకు సిపిఐ పోరాడుతుంది
గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం  ఇవ్వాలి
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి

న్యూస్ తెలుగు / వినుకొండ :  వినుకొండ ప్రాంతానికి కమ్యూనిస్టు ఉద్యమ మహోజ్వల చరిత్ర ఉన్నదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో గల గోగినేని కళ్యాణమంటపంలో జరుగుతున్న సిపిఐ నియోజకవర్గ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో పులుపుల వెంకట శివయ్య ది మరువలేని పాత్ర అని రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ బీజాలు మార్సిస్టు భావజాలాన్ని తాను క్లాస్ టీచర్ రూపంలో విద్యార్థులను కమ్యూనిస్టులుగా తయారు చేస్తూ విస్తరింపజేసిన చరిత్ర ఆయనకు ఉన్నదని కమ్యూనిస్టు ఉద్యమాన్ని బ్యాన్ చేసిన సందర్భంలో ఆయన ప్రాణాలను త్రుటిలో పట్టణ ప్రజలు కాపాడారని తన ప్రాణాలు సైతం ఏనాడైనా విడువవలసి వస్తుందని తెలిసి కుటుంబంతో సైతం తెగ దెంపులు చేసుకొని ఉద్యమంలో కొనసాగారని ఆయన అన్నారు. వినుకొండ ప్రాంతానికి కమ్యూనిస్టు శాసనసభ్యులుగా నాలుగు సార్లు పోటీ చేసి ఒక రూపాయి ఖర్చు లేకుండా రెండుసార్లు ఘనవిజయం సాధించారని ఆయన అన్నారు. ఒక రూపాయి సంపాదించని ఆయన ఈనాటికి ఆయన పేరుతో ఒక సెంటు స్థలం, ఒక ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో కమ్యూనిస్టు శాసనసభ్యులుగా పేద ప్రజలకు విశ్వాసపాత్రుడైన సేవకుడిగా పని చేశారని ఆయన కొనియాడారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల కోసం పోరాడుతారని ఆయన అన్నారు. సిపిఐ జాతీయ మహాసభలు షెడ్యూల్ ప్రకటించినందున మూడు సంవత్సరాలకు ఒకసారి జరగనున్న జిల్లా రాష్ట్ర నియోజకవర్గ మహాసభలు జరుగుతున్నాయని దానిలో భాగంగానే మన పల్నాడు జిల్లా ప్రాంతంలోని అన్ని నియోజకవర్గ మహాసభలు జరిగి పలనాడు జిల్లా మహాసభ వినుకొండలో 7, 8 తేదీల్లో జరగనున్నదని ఆయన అన్నారు.ఈనాడు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయుటలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో తీరని ద్రోహం చేస్తున్నారని ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించలేదని అటువంటి ప్రధాని నేడు గత ప్రభుత్వాలు స్థాపించిన పరిశ్రమలను ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అంబానీ అదాని లాంటి గుత్త కోటీశ్వరులకు అమ్మేస్తున్నా రని ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో ఉన్న ప్రధానులు 67 సంవత్సరాల లో దేశం కోసం 60 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆ డబ్బంతా ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టారో ఏ గుత్తకోటీశ్వరులకు అందించారో తెల్ల పేపర్ పై దేశ ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు. మన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతుంటే ఆదుకోలేని మోడీ ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో పెట్టిన బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా తాను స్వయంగా కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కూడా ప్రకటించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలకి ఒకసారి జరుగుతున్న పార్టీ మహాసభలలో భాగంగా గ్రామ శాఖ నుండి మండల పట్టణ నియోజకవర్గ జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలు షెడ్యూలు ప్రకటించి జరుగుతున్నాయని దానిలో భాగంగానే పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మండల పట్టణ మహాసభలు పూర్తికావచ్చాయని సిపిఐ పల్నాడు జిల్లా మహాసభలు ఆగస్టు 7, 8 తేదీలలో వినుకొండ పట్టణంలో ఘనంగా జరగనున్నాయని వినుకొండ పట్టణాన్ని అరుణారుణ తోరణాలతో అలంకరించి మహాసభలు ఘనంగా విజయవంతంగా నిర్వహించాలని కమ్యూనిస్టు శ్రేణులు అభిమానులు ప్రజలందరూ ఈ మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ సిపిఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు సండ్రపాటి సైదా, ఉలవలపూడి రాము, పటాన్ లాల్ ఖాన్, షేక్ కిషోర్, పిన్నె బోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, వూట్ల రామారావు,ఎ. పవన్ కుమార్, కె. మల్లికార్జునరావు, కొండముట్ల చిన్న సుభాని, ఎం. సుబ్బారావు, షేక్ మస్తాన్, సోడాల సాంబయ్య, నలబోతుల శ్రీను, జల్లి వెంకటేశ్వర్లు, దారి వేముల మరియ బాబు, కాశమ్మ, రమణమ్మ, గోవిందమ్మ, పద్మ, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారావు, మహాసభకు ఐదు మండలాల నుండి, పట్టణం శాఖల నుండి పార్టీ సభ్యులు ఎన్నికైన ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభ అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. వినుకొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా బూదాల శ్రీనివాసరావు 9 మంది కమిటీ సభ్యులుగా, వినుకొండ పట్టణ కమిటీ కార్యదర్శిగా ఉలవలపూడి రాము సహాయ కార్యదర్శిగా కొండ్రముట్ల చిన్న సుభాని మరి 11 మందితో కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. (Story:ఉత్సాహపూరిత వాతావరణం లో ఘనంగా సిపిఐ  మహాసభ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version