Home వార్తలు తెలంగాణ అక్రమ పట్టాలను రద్దు చేయాలని సిపిఐ ధర్నా

అక్రమ పట్టాలను రద్దు చేయాలని సిపిఐ ధర్నా

0

అక్రమ పట్టాలను రద్దు చేయాలని సిపిఐ ధర్నా

న్యూస్‌తెలుగు/వనపర్తి : వీపనగండ్ల మండలం బొల్లారంస.నెం. 618 లో ముగ్గురు రైతుల అక్రమ పట్టాలను రద్దు చేయాలని సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. అక్రమ పట్టాలను రద్దు చేయాలని, దాన్ని గ్రామ కంఠం భూమిగా ప్రకటించాలని, ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. బొల్లారం రెవెన్యూ సదస్సులు ఇచ్చిన భూ ఫిర్యాదులను పరిష్కరించాలని ఎమ్మార్వో వరలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వంక గోపాల్, మండల కార్యదర్శి ఎం కురుమయ్య మాట్లాడుతూ.. బొల్లారం సర్వే నెంబర్ 618లో 15 ఎకరాల 15 గుంటల భూమి ఉందన్నారు. 30 ఏళ్ల క్రితం ఆ భూమి పట్టాదారులు గ్రామస్తులకు ఇళ్ల స్థలాల కోసం అన్నారన్నారు. కొన్నవారు అందులో ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమిని గ్రామకంఠం భూమిగా నమోదు చేసి, నివాసం ఉంటున్న వారి ఇండ్లకు పర్మిషన్ ఇవ్వాలని ఎమ్మార్వో, కలెక్టర్, ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావుకు దరఖాస్తులు సమర్పించడం జరిగిందన్నారు. వీటిపై విచారణ జరపకుండా రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ఇండ్ల స్థలాలకు అమ్మిన భూమిని, వారి వారసులు కావలి సాయిబాబా, కావలి సుదర్శన్, కావలి రాముడు లకు పట్టాలి ఇచ్చి రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేశారన్నారు. ఆ భూములకు రైతుబంధుకు ఇవ్వటమే గాక బ్యాంకులో రుణాలు కూడాఇస్తూ వస్తున్నారన్నారు. దానిపై అభ్యంతరం తెలపడంతో ఇటీవల రైతు భరోసా ఇవ్వటం లేదన్నారు. అక్రమ పట్టా పొందిన ముగ్గురిలో కావలి సాయిబాబ ఇటీవల ఎర్ర మఠం కు చెందిన సుజాతకు స.నెం. 618లో ఎకరా 10 గుంటల భూమిని అక్రమంగా పట్టా (రిజిస్ట్రేషన్) చేశారని,అక్రమ పట్టా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్నారు. కావలి సుదర్శన్ కావలి రాముడు ల పేర పట్టాలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వేనెంబర్ 106లో సాగులో ఉన్న పట్టాదారుల పేర్లు ధరణి వచ్చినప్పుడు మాయం చేసి, ఇతరుల పేర్లు ఎక్కించారన్నారు. విచారణ జరిపి సాగులో ఉన్న పట్టాదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించాలన్నారు. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో స.నెం.618,స.నెం. 106 భూ సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తు చేసిన ఇంతవరకు విచారణ జరిపి సమస్య పరిష్కరించలేదన్నారు. కాగా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మార్వో వరలక్ష్మీ హామీ ఇచ్చారన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. బొల్లారం గ్రామ శాఖ కార్యదర్శి చలమారెడ్డి, నాయకులు వేమన్న కృష్ణయ్య తడకల వెంకటస్వామి శివయ్య దగడపల్లి కురుమయ్య దేవరపాగా కురుమయ్య చిన్న రాముడు తదితరులు పాల్గొన్నారు. (Story:అక్రమ పట్టాలను రద్దు చేయాలని సిపిఐ ధర్నా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version