సంక్షేమ పథకాలు పేరుతో మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
న్యూస్ తెలుగు/సాలూరు : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు. ఆదివారం సాలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మక్కువ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
మక్కువ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు అధ్యక్షతన .ముఖ్య అతిథులు గా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పీడిక రాజన్నదొర అరకు పార్లమెంట్ కమిటీ సభ్యులు, మక్కువ మండల జడ్పిటిసి, మావుడి శ్రీనివాస నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసపూరిత పరిపాలనను ప్రజల గ్రహించాలని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు మొదటి సంవత్సరం ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ కుటమీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ప్రజలందరూ గ్రహించి కూటమి నాయకులు చేస్తున్న అబద్ధపు హామీలను నమ్మవద్దు అని చెప్పారు. బాబు షూరిటీ మోసం గారంటీ అనే నినాదంతో ప్రతి గ్రామంలో ఉన్న వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు ఇంటింటికి వెళ్లి ఈ పాంప్లెట్లు పంచాలని అన్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశ – నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు మాదిరెడ్డి మధుసూదన్ రావు, మండల వైయస్సార్ పార్టీ ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:సంక్షేమ పథకాలు పేరుతో మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం)
