Home వార్తలు తెలంగాణ సిపిఐ పోరాట చరిత్రను చెరపలేరు: నేతలు

సిపిఐ పోరాట చరిత్రను చెరపలేరు: నేతలు

0

సిపిఐ పోరాట చరిత్రను చెరపలేరు: నేతలు

న్యూస్‌తెలుగు/వనపర్తి : భారతదేశ పోరాటాల చరిత్రలో సిపిఐది ప్రత్యేక స్థానమని, దాన్ని ఎవరు చెరపలేరని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు కే విజయ రాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండి ఫయాజ్ అన్నారు. ఏదుల మండలం చీరకపల్లిలో సిపిఐ నూతన శాఖ ఏర్పాటు చేశారు.అరుణ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు ఆవిష్కరించారు. ముందుగా గ్రామంలో ప్రదర్శన అనంతరం అంజి అధ్యక్షతన తర్వాత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశ స్వాతంత్ర పోరాటం మొదలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సిపిఐ చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి అన్నారు. పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు కమ్యూనిస్టుల పోరాటంతోనే పాలక పార్టీలు అమలు చేస్తున్నయన్నారు. పార్టీలకు పదవులకు సంబంధం లేకుండా న్యాయం, ధర్మం పక్షాన పోరాటం సాగిస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాలను పేదలకు పంచి 3000 గ్రామాలను దొరల నుంచి విముక్తం చేసిందన్నారు. 4,500 మంది కార్యకర్తలు అమరులయ్యారన్నారు. పేదలు కూలీలు రైతులు కార్మికులు నిరుద్యోగులు ఉద్యోగులు మహిళలు యువకులు అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పోరాటం సాగిస్తోందన్నారు. వందేళ్ళ పోరాట చరిత్ర దేశంలో మరో పార్టీకి లేదన్నారు. భూసంస్కరణలు పేదలకు భూములు పంపిణీ ఇళ్లస్థలాలు ఇళ్ల పంపిణీ రుణాల రద్దు రైతు పెట్టుబడి రైతులకు గిట్టుబాటు ధర కార్మికులకు కనీస వేతనం కోసం సిపిఐ పోరాడుతోందన్నారు. బిజెపి దేశ సంపదను సంపన్నులకు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి రైతు అకౌంట్లో 15 లక్షలు హామీలు బిజెపి అమలు చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయాలన్నారు. కళాకారుల ప్రదర్శన విప్లవ గేయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కళావతమ్మ, రమేష్ గోపాలకృష్ణ, కృష్ణవేణి ఏసు, విజయుడు, లక్ష్మీనారాయణ, వంక గోపాల్ తదితరులు పాల్గొన్నారు.(Story:సిపిఐ పోరాట చరిత్రను చెరపలేరు: నేతలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version