Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కవి కమలారామ్ కు ఎన్టీఆర్ అవార్డు

కవి కమలారామ్ కు ఎన్టీఆర్ అవార్డు

0

కవి కమలారామ్ కు ఎన్టీఆర్ అవార్డు

న్యూస్ తెలుగు / వినుకొండ : సాహితీరంగంలో తను చేసిన సేవలను గుర్తించి శనివారం హైదరాబాద్ త్యాగరాయగాన సభలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు పురస్కారాన్ని పట్టణానికి చెందిన జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు, జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షులు, రచయిత కమలారామ్ కి అందించారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక సంస్థ, జాతీయ అధ్యక్షులు రాజకుమార్ , జాతీయ కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి గంగా శ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అవార్డు తోపాటు గోల్డ్ మెడల్, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ అవార్డు పొందిన కమలారామ్ ను పట్టణానికి చెందిన కవులు, కళాకారులు, ప్రముఖులు, మిత్రులు,జనవిజ్ఞాన వేదిక నాయకులు, జాషువా సమాఖ్య కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. (Story:కవి కమలారామ్ కు ఎన్టీఆర్ అవార్డు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version