అనాధ శవానికి అంత్యక్రియలు
న్యూస్ తెలుగు / వినుకొండ :వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు అనాధ శవానికి ఆదర్శ ఫౌండేషన్ అన్ని తానై అంత్యక్రియలు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులు పి.వి.సురేష్ బాబు, అధ్యక్షులు పూవ్వాడ క్రిష్ణ, సభ్యులు నాగూర్ (సర్కార్), నాగార్జున, కామేపల్లి సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీ.వి. సురేష్ బాబు మాట్లాడుతూ. అనాధ శవాలకి అంత్యక్రియలు చేయడం అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యాన్ని ఇస్తుందని చెబుతూ వినుకొండ పట్టణంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. సమాజ హిత కార్యక్రమాలు చేసేటువంటి సేవా సంస్థలు ఈ సందర్భంగా ప్రేమ పూర్వక శాల్యూట్ చేశారు. (Story:అనాధ శవానికి అంత్యక్రియలు)
