మానవాళికి ప్రాణ వాయువునిచ్చి… మనుగడనిచ్చే చెట్లను విరివిగా పెంచాలి
వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు వనపర్తి పట్టణంలోని ఇకో పార్కులో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ విజయేంద్ర బోయి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, డి.ఎఫ్.ఓ సత్యనారాయణతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏది ఉన్నా లేకున్నా సమస్త మానవాళి జీవనానికి ప్రాణ వాయువు అవసరం ఉంటుందని అలాంటి ప్రాణ వాయువును ఇచ్చే చెట్లను విరివిగా నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
పర్యావరణం సమతుల్యంగా ఉండటానికి 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలని, కానీ వనపర్తి జిల్లాలో 18-19 శాతం మాత్రమే ఉందని దీనిని 33 శాతానికి పెంచడానికి జిల్లాలోని ప్రజలందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
జిల్లాలోని ప్రతి విద్యార్థి, యువత తమ ఇళ్లలో, పొలాల్లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చెట్లు నాటాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు తమ ఇళ్ల వాకిలిలో మొత్తం బండలు, కాంక్రీట్ వేసుకోకుండా కొంత స్థలం మొక్కలు నాటేందుకు ఉంచుకోవాలని సూచించారు.
ఇళ్లలో పెళ్లి అయిన, పుట్టిన రోజు జరుపుకున్న మరే ఇతర శుభ కార్యక్రమాలు జరుపున్న ఆరోజుకు గుర్తుగా మొక్కలు నాటడం మరచిపోవద్దని తెలియజేశారు.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను పాటించేందుకు వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని….
ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలని ఆయన సూచించారు.
వృక్షో రక్షిత – రక్షితః అనే నానుడి ప్రకారం చెట్లను మనం కాపాడితే మనలను చెట్లు కాపాడతాయని అన్నారు.
వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం 21 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఆయా ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు, విద్యార్థులు అందరూ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని తెలియజేశారు.
ప్రతి ఇంటి ముందు, పొలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
ప్రతి పాఠశాల, కళాశాల, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు
జిల్లా కలెక్టర్ తో పాటు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, వనపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, విద్యార్థులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. (Story:మానవాళికి ప్రాణ వాయువునిచ్చి… మనుగడనిచ్చే చెట్లను విరివిగా పెంచాలి)
