అసంఘటిత రంగ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలి
న్యూస్ తెలుగు/సాలూరు : ఉద్యోగస్తులకు పనికి తగిన వేతనం ,అసంఘటిత రంగ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సాలూరు పట్టణంలో చేపట్టిన దేశవ్యాప్త సమ్మె ప్రశాంతంగా జరిగింది. ఈ కార్యక్రమం సాలూరు మున్సిపల్ కార్యాలయం నుండి కార్మికులు ఉద్యోగులు ట్రేడ్ యూనియన్ సంఘాలు ర్యాలీగా బయలుదేరి సాలూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు యన్ వై నాయుడు మాట్లాడుతూ. కార్మికులకు కనీస వేతన చట్టం అమలు పరచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస హక్కులు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని అన్నారు. ఎల్ ఐ సి ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడి ఆశ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, వీరికి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వివిధ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం ఆఫీసులో ఉద్యోగులు స్వచ్ఛందంగా వారి ఆఫీసులు మూసివేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు మర్రి శ్రీనివాసరావు, కోరాడ ఈశ్వర రావు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. (Story:అసంఘటిత రంగ కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలి)

