Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత

న్యూస్ తెలుగు/సాలూరు : అక్రమంగా నిల్వ ఉంచిన 3250 కేజీల( పి డి ఎఫ్) రేషన్ బియ్యాన్ని పట్టుకొని నిందితున్ని అరెస్టు చేయడం జరిగిందని సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు తెలిపారు. బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఉదయం 10.30 గంటల సమయము లో సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ నకు పిడిఎస్ (కోట బియ్యం ) బియ్యం అక్రమ నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకోవడం జరిగిందని అన్నారు. రాబడిన సమాచారం మేరకు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు నా సిబ్బందితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. సాలూరు పెద్దబజార్ నందు బుద్దెపు సురేష్ అను ఆశామి యొక్క షాప్ ను
తనిఖీ చేయగా సదరు షాప్ లో 75 బస్తాలు సుమారు 3,250 kgs పిడిఎస్ (కోటబియ్యం) బియ్యం అక్రమానిల్వ బయటపడిందని తెలిపారు. సదరు బియ్యం ఎక్కడవని అని ప్రశ్నించగా సాలూరు చుట్టుప్రక్కల గ్రామాలలో
తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు తిరిగి అమ్ముతాను అని ముద్దాయి చెప్పడం జరిగిందని అన్నారు. అక్రమముగా కోటబియ్యం నిల్వ ఉంచు ట నేరము అని తెలియాచేసి ఆక్యురెన్స్ రిపోర్ట్ మరియు సంబంధిత ఇతర రికార్డ్స్ తదుపరి చర్య నిమిత్తం సాలూరు డిప్యూటీ తహసీల్దార్(సివిల్ సప్లయస్) గారికి అప్పగించడం జరిగిందని తెలియజేశారు. (Story:అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments