Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘ‌నంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి

ఘ‌నంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి

ఘ‌నంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి

న్యూస్ తెలుగు /సాలూరు : పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజలకు చాటి చెప్పిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర అన్నారు మంగళవారం
మాజీ సీఎం డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా సాలూరు,మామిడిపల్లిలో వైయస్సార్ విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుడంటే ఎలా ఉండాలో చాటి చెప్పిన మహానేత వై.ఎస్.ఆర్ అని అన్నారు. మనసు ఉండాలే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేతల్లో చాటారని తెలిపారు. ఆయన.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చేసింది ఐదేళ్ళ మూడు నెలలే .ఆ కొద్ది కాలంలోనే మైలురాళ్లలాంటి సంక్షేమ పధకాలును అమలు చేసి,చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వై.ఎస్.ఆర్ పధకాలను కొనసాగించక తప్పనిసరి పరిస్థితి.నేడు వచ్చిందని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు సీట్స్ పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు, మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, సువ్వాడ భరత్ శ్రీను, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దండి శ్రీనివాసరావు, సువ్వాడ రామకృష్ణ వైసీపీ ప్రజాప్రతినిధులు, వివిధ వైసీపీ అనుబంధ విభాగాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ కార్యకర్తలు,అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. (Story:ఘ‌నంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments