Home వార్తలు తెలంగాణ విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

0

విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్యే మేఘారెడ్డి

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

సోమవారం గోపాల్పేట మండలం బుద్ధారం గండి వద్దగల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రూ. 13.50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు

ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు

ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలను పెంచి విద్యార్థుల ఇబ్బందులను తొలగించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు

మునుపెన్నడూ లేని విధంగా నేడు విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, పంపిణీ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు అనేక అంశాలను నేర్చుకోవచ్చునని ఉన్నత చదువుపై దృష్టి సారించి కన్న తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు

కార్యక్రమంలో TGEWIDC ఈ రామచంద్రం, DE వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version