Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో ఎమ్మార్పీఎస్ ఆవిష్కరణ దినోత్సవం

వినుకొండలో ఎమ్మార్పీఎస్ ఆవిష్కరణ దినోత్సవం

0

వినుకొండలో ఎమ్మార్పీఎస్ ఆవిష్కరణ దినోత్సవం

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక సురేష్ మహల్ సెంటర్లో 31 వ ఎమ్మార్పీఎస్ ఆవిష్కరణ దినోత్సవం మరియు మాన్యశ్రీ కృష్ణ మాదిగ జన్మ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు హిట్లర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చందోలు నాగవాణి ప్రసంగిస్తూ. మంద కృష్ణ సామాజిక న్యాయ ఉద్యమ పితామహుడు అన్నారు . గత 30 సంవత్సరాలలో ఆరోగ్య శ్రీ పథకాన్ని గుండెజబ్బు పిల్లల ఉద్యమం ద్వారా సాధించారు. వికలాంగులకు 6000 పెన్షన్ సాధించారు. వృద్ధులకు 4000 పెన్షన్ పెరగడానికి కృష్ణ పోరాటం చేశారన్నారు. ఆకలికేకలపోరుయాత్ర ఉద్యముతోకరికి 6కిలోల రేషన్ బియ్యం వచ్చేటట్టు సాధించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ లలో రిజర్వేష్ న్ సాధించారు. 2000 నుండి 2004 వరకు 23000 ఉద్యోగాలు ఎస్సీ వర్గీకరణ ద్వారా సాధించారు. వేల సంఖ్యలో డాక్టర్,ఇంజనీర్లు విద్యా అవకాశాలు మాదిగ లు పొందారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం యధావిధిగా ఉండేట్టు దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించారు. ఎస్సీ, ఎస్సీ,ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలపై ఆధిపత్య వర్గాల అత్యాచార హత్యలు మీకు న్యాయమా మాకు న్యాయమా అంటూ ఉద్యమం నిర్వహించి ఫస్ట్ అఫ్ కోర్టులను సాధించారు తెలంగాణ అమరవీరుల తల్లుల కడుపుకోత ఉద్యమంతో ఇంటికో ఉద్యోగం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు అండగా నిలిచి ఆర్టీసీని ప్రైవేటుపరం కాకుండా పోరాడిన ఉద్యమకారుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఓసిలకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించి బిసి ఎస్సి ఎస్టీ అభ్యర్థులకు తగ్గించకపోతే వారి తరఫున కటాఫ్ మార్కులు తగ్గించేయాల పోరాడి సాధించిన మూడు లక్షల మంది నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు.అనాథ పిల్లలకు రిజర్వేషన్ కేటాయించాలని అనాథల అరిగోస ఉద్యమాన్ని నిర్వహించారు. పేద,బలహీన వర్గాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన ముందుంది పోరాడేవారని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ కందుకూరు శ్యామ్, అచ్చిబాబు, రాజు, ఇశ్రాయేలు, గ్రామస్తులు పాల్గొన్నారు. (Story:వినుకొండలో ఎమ్మార్పీఎస్ ఆవిష్కరణ దినోత్సవం)

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version