బిఆర్ఎస్ ఆధ్వర్యములో పి.వి.నరసింహారావు కి నివాళులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారత మాజీ ప్రధాని,భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో బిఆర్ఎస్ నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ బహుభాషావేత్త,రాజకీయకోవిధుడు,ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు,తెలంగాణ నుండి తొలి ప్రధానిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి భావితరాలకు ఆదర్శప్రాయుడుగా పి.వి నిలిచారని కొనియాడారు. నివాళులు అర్పించిన వారిలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్,ప్రేమ్ నాథ్ రెడ్డి,యువత అధ్యక్షులు సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము,గౌడ్ నాయక్,సునీల్, వాల్మీకి,చంద్రశేఖర్,నందిమల్ల.సుబ్బు,లక్ష్మణ్,అమర్నాథ్,వినోద్,అలీం,మహమూద్,తోట.శ్రీను తదితరులు ఉన్నారు. (sTORY:బిఆర్ఎస్ ఆధ్వర్యములో పి.వి.నరసింహారావు కి నివాళులు)
