జర్నలిస్టుపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు. సీనియర్ జర్నలిస్ట్ 10 టీవీ జిల్లా ప్రతినిధి నాయుడు పై విజయనగరంలో టూ టౌన్ ఎస్ఐ.మురళి శుక్రవారం నాడు ఫుల్ బాగ్ అయ్యప్ప నగర్ లో నివసిస్తున్న వృద్ధ దంపతులు రిటైర్డ్ డీఈవో ఎస్. అప్పలనాయుడు పై దుండగులు దాడి దాడి చేయడం జరిగింది. దాడి జరిగిన 24 గంటల తరువాత ఎస్సై మురళి మరియు పోలీస్ సిబ్బంది వచ్చి విచారణ చేయగా అక్కడ విధులు నిర్వహిస్తున్న 10 టీవీ జర్నలిస్ట్ నాయుడు వార్త సేకరణ కోసం తీస్తున్న సెల్ ఫోన్ తీసుకొగా నేను జర్నలిస్ట్ అని నాయుడు చెప్పగా విలేకరులు అయితే ఎక్కువ నా సంగతి తెలీదు మీకు నేను చెప్పినట్టుగా వినవలసిందే అని దురుసుగా ప్రవర్తించిన ఎస్ ఐ. మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్. సాలూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు. బాలి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సాలూరు తాసిల్దార్ బి నీలకంఠరావుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై ఎస్సై తీరు మంచి పద్ధతి కాదని. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు ఉన్నతాధికారులకు చేరవేసి న్యాయం చేయాలని ఉద్దేశంతో తప్ప వేరొక ఉద్దేశం లేదని కావున పోలీసు ఉన్నత అధికారులు. జర్నలిస్టులు స్వేచ్ఛగా కలిసి పనిచేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 10.టీవీ. శ్రీనివాసరావు. సాక్షి.టీవీ. శ్రీనివాస్. టీవీ 9.మధు. టీవీ 5.సీతారాం. బిగ్ టీవీ గుప్తా. ఐ. న్యూస్. దేవేంద్ర నాయుడు.99.టీవీ. ప్రశాంత్. విశాలాంధ్ర మోహన్ రావు. సూర్య సుబ్రహ్మణ్యం. ఉదయం తవిటి నాయుడు. తదితరులు పాల్గొనడం జరిగింది. (Story:జర్నలిస్టుపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి)
