Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  జూన్ 5న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

 జూన్ 5న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

0

 జూన్ 5న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

న్యూస్ తెలుగు /వినుకొండ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూఢిల్లీ వారి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశానుసారం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు వారి ఆధ్వర్యంలో గురువారం మండల న్యాయ సేవాధికార సంస్థ, వినుకొండ వారు జులై 05 న జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు అన్ని రకాల సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ కేసులు, మనోవర్తి కేసులు, కుటుంబ వివాద కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు మరియు ముందస్తు రాజీ చేసుకోదలచిన కేసులను ఇరుపక్షాల మధ్య సామరస్య పూర్వకంగా రాజీ చేసి పరిష్కరించబడును. కావున వినుకొండ న్యాయస్థానం పరిధిలోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుని తమ వివాదాలను శాంతియుతంగా రాజీ చేసుకొని పరిస్కరించుకోవలసినదిగా కోరుతున్నాం. (Story: జూన్ 5న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version